వెబ్ న్యూస్, బతుకమ్మ : బిహార్ లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈక్రమంలో విపక్ష కూటమి మహాగఠ్ బంధన్ ’తేజస్వీ ప్రతిజ్ఞ ప్రాణ్ పేరుతో మేనిఫెస్టోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తదితరుల సమక్షంలో విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటంబానికి ప్రభుత్వం ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర హామీలు ఇందులో పేర్కొన్నారు. బిహార్ ను దేశంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తేజస్వీయాదవ్ వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే ఈత కల్లును చట్టబద్ధం చేస్తామని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. 243 స్థానాలు ఉన్న బిహార్ లో నవంబర్ 6 న తొలిదశ, 11 న రెండో దశ పోలింగ్ జరగనుంది.
