- నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
బతుకమ్మ, కోటగిరి : భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం చెల్లించాలని బి.ఆర్.ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పోతంగల్ మండలం సుంకిని కారేగం పోతంగలలో పర్యటించి మంజీరా వరద ఉధృతిని పరిశీలించారు. సుంకినిలో మంజీరా వరద నీరు గ్రామంలోకి చేరుకోవడంతో వరద నీటిని పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. వైద్య శిబిరంలో అందుతున్న వైద్య సేవలు అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అని పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కారేగాం గ్రామంలో మంజీరా నీటిలో నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. సుమారు 200 ఎకరాల వరకు వరి పంట నీట మునిగిందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం పోతంగల్లో వంతెన పైకి వెళ్లి మంజీరా వరద ఉధృతిని నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పొదంగలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించాలని టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జుబేర్ డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు పరిహార అందేలా చూడాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేశాల మేరకు పంట నష్టం జరిగిన గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, టిఆర్ఎస్ మండల నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్, కిషన్, తెల్ల రవికుమార్, నవీన్, డాక్టర్ హకీమ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కప్ప సంతోష్, నజీర్, అరవింద్, మామిడి నవీన్, యోగేష్, జలాల్, పోతంగల్, కోటగిరి మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.