దెబ్బతిన్న పంటలను పరిశీలించిన బిఆర్ఎస్ నాయకులు
నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ బతుకమ్మ, కోటగిరి : భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం చెల్లించాలని బి.ఆర్.ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పోతంగల్ మండలం సుంకిని కారేగం పోతంగలలో పర్యటించి మంజీరా వరద ఉధృతిని పరిశీలించారు. సుంకినిలో మంజీరా వరద నీరు గ్రామంలోకి చేరుకోవడంతో వరద నీటిని పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. వైద్య శిబిరంలో అందుతున్న వైద్య సేవలు అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి...