కాళేశ్వరం పై కాంగ్రెస్ విషం చిమ్మడం పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా

వేల్పూర్, బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ జీవనాడి కాళేశ్వరం పై విషం చిమ్ముడాన్ని, కేసీఆర్ పై బురుదచల్లడాన్ని, కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పజేప్పడాన్ని నిరసిస్తూ బాల్కొండ నియోజకవర్గం బీయర్ఎస్ శ్రేణులు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు కీ. శే. వేముల సురేందర్ రెడ్డి విగ్రహం వద్ద చేపట్టిన ఈ ధర్నాలో భాగంగా జాతీయ రహదారిని దిగ్బందణం చేశారు. రోడ్డు పై బైఠయించి సీ ఎం...