26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం బుధవారం బంజారాహిల్స్‌ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రిటిష్ హైకమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రాఘురామన్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో భారత్ – యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించారు.

 

British Deputy High Commissioner meets TRS Chief Kalvakuntla Kavitha

 

ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

British Deputy High Commissioner meets TRS Chief Kalvakuntla Kavitha

More articles

Latest article