టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

  హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం బుధవారం బంజారాహిల్స్‌ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రిటిష్ హైకమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రాఘురామన్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో భారత్ - యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించారు.    ...