24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పుట్టబోయే బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టబోయే బిడ్డకు తల్లి పాలు శ్రేయస్కారమని గర్భిణీ బాలింతలకు సూచించారు. మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుకోవాలని చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, వైద్య సిబ్బంది, గర్భిణీ బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article