27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బూత్ కార్యకర్తే పార్టీకి వెన్నెముక

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బూత్ కార్యకర్తే పార్టీకి వెన్నెముక అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయం లో గురువారం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎమ్మెల్సీ ఎన్నికలలో బూత్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ గా మల్క కొమురయ్య, పట్టుభద్రుల ఎమ్మెల్సీ గా అంజి రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. వారి గెలుపు లో బూత్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారు అన్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది అని అన్నారు. కేంద్రం లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పైన విశ్వాసం తో ఇందూరు జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, పోతనకర్ లక్ష్మి నారాయణ, జిల్లా అధికార ప్రతినిధి బుసాపూర్ శంకర్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి బద్దం కిషన్, కార్పొరేటర్లు మెట్టు విజయ్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇప్పకాయల కిషోర్, ఆనంద్ రావు,మల్లేష్ గుప్తా,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ, బీజేవైఎం నాయకులు వినోద్ రెడ్డి, దేవా నాయక్,నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article