27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అబుల్ కలామ్ ఆజాద్‌ జయంతి సంధర్బంగా విద్యార్ధులకు పుస్తాకాలు పంపిణి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  :

స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ వార్డు సభ్యుడు అక్బర్  పేర్కొన్నారు. బాన్సువాడలో మంగళవారం మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్బంగా పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,పండ్లు పంపిణీ చేశారు.ఈ సంద‌ర్భంగా మాజీ వార్డు సభ్యుడు అక్బర్ మాట్లాడుతూ… మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, గాంధేయవాది భారత స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన నాయకుడని తెలిపారు. స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, ప్రాథమిక విద్యను అందరికీ అందించాలన్న దిశగా ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ నాయకత్వంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రముఖ విద్యాసంస్థల స్థాపనకు పునాదులు వేశారని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ,అబ్దుల్ ఖాదర్,సోహెల్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article