27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లైబ్రరీ ఫెస్ట్ – 2026 లో ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలని, విద్యార్థులు తమ లక్ష్యాలను తమ కోసం మాత్రమే నిర్దేశించుకోవాలని ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం జరుగుతున్న లైబ్రరీ ఫెస్ట్ 2026 కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన, ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచడానికి విశ్వవిద్యాలయం వెనుకాడదని హామీ ఇచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరైన వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం. యాదగిరి మాట్లాడుతూ ఒక విషయంపై లోతైన, స్పష్టమైన అవగాహన రావాలంటే పుస్తక పఠనం చేయాలన్నారు.

 

Book reading should continue continuously.

 

ఈ కార్యక్రమంలో కీనోట్ స్పీకర్ ఆచార్య ఆంజనేయులు లైబ్రరీ ఇంచార్జ్ ఆచార్య కె.లావణ్య, యూనివర్సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి, తెలుగు విభాగాధిపతి ఆచార్య కనకయ్య, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article