. . . అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలోని ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ హాజరై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో బోనాల పండుగ ఒకటని, ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో ఊరూరా బోనాల పండుగ నిర్వహించి, ప్రజలు తమ మొక్కులను తీర్చుకుంటారని ఆయన అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, ప్రజలంతా ఆయురారో గ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అరే కటికే సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు కటికె రమేష్, హకీమ్, కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ఖామర్ సుల్తానా గౌస్ పాషా, నాయకులు, నార్ల సురేష్, దాసరి శ్రీను, వాహబ్, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

