28.8 C
Hyderabad
Monday, August 3, 2026

15న టిఎన్ జిఓ ల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. టిఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ… టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల శ్రీ శ్రీ శ్రీ నవ దుర్గ మాత ఆలయ ప్రాంగణంలో ఆషాడ బోనాల ఉత్సవాలు మంగళవారం ఉ. 11 గం.లకు నిర్వహిస్తున్నామని  తెలిపారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగ సోదరిమణులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ,టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, క్లాస్ ఫోర్ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యవర్గ బృందం, రిటైర్డ్ ఉద్యోగులు ,పెన్షనర్స్ అసోసియేషన్  అధిక సంఖ్యలో హాజరై, బోనాల ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తదనంతరం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఆ జగదాంబ మాత కృపకు పాత్రులై, టీఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఆహ్వానిస్తున్నట్టు తెలియజేశారు. ఈ విలేఖరుల సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ , జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి , టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ , జిల్లా కోశాధికారి దినేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, నిజామాబాద్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి తదితరులు ఉన్నారు.

More articles

Latest article