15న టిఎన్ జిఓ ల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. టిఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ... టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల శ్రీ శ్రీ శ్రీ నవ దుర్గ మాత...