31.8 C
Hyderabad

బొప్పాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :  రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  బోనాల పండగను ఘనంగా నిర్వహించారు.  గ్రామంలోని అన్ని కుల సంఘాల నుండి మహిళలు బోనాలతో రాజా భజంత్రిలతో ఊరేగింపుగా గ్రామ దేవతల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పట్ల సురేష్, మాజీ జెడ్పిటిసి నారోజీ గంగారాం, కుర్మాజీ సాయిలు, బాపూజీ లింగం, సురేందర్, పట్ల సంతోష్, పట్ల స్వామి, నందిగామ కృష్ణ, లచ్చయ్య, కే.గంగారాం, కుర్మాజి స్వామి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article