నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నాళేశ్వర్ గ్రామంలోని మున్నురు కాపు సంఘ ఆద్వర్యంలో ఘనంగా పోశమ్మ,మహలక్ష్మి ఆమ్మవార్లకు బోనాలు పండుగ నిర్వహించారు. ఈ సందర్బంగా మున్నురు సంఘ సభ్యులు మట్లాడుతు తమ నాళేశ్వర్ గ్రామంలో 400 నలుగు వందల మున్నురు కాపు కుటుంబాలు ఉన్నాయని,ఈ సంఘ సభ్యులందరి ఆద్వర్యంలో మున్నురు కాపు కళ్యాణ మండాపాన్ని నిర్మాణం చేపట్టామాని తెలిపారు. ఆ మండపంలో మున్నురు కాపు కుల బంధువులంతా కలిసి పోశమ్మ,మహలక్ష్మి ఆమ్మ వార్లకు బోనాలతో మహిళలంతా ఊరేగింపుగా వచ్చి నృత్యలతో గ్రామంలో విది విది తిరుగుతు ఆమ్మ వార్లకు మొక్కలు తీర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, మాజీ సర్పంచులు ద్యాగ సరీన్, మగ్గరి నర్సింగ్ రావు, మాజీ యం.పి టి.సి కారడి లక్ష్మణ్, నాయకులు చిన్నదోడ్డి ప్రవీణ్, శ్రీనివాస్, గణేష్, సంజీవ్ , రమేష్, సురేష్, మున్నురు కాపు సభ్యులు గణేష్, సంపత్,పోతన్న, సుధాకర్, శ్రీనివాస్, గ్రామస్థులు పాల్గొన్నారు.
