బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో బోనాల పండుగ ఒకటని, ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో ఊరూరా బోనాల పండుగ నిర్వహించి, ప్రజలు తమ మొక్కులను తీర్చుకుంటారని ఆయన అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, ప్రజలంతా ఆయురారో గ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటారన్నారు. దేశ, విదేశాల్లో కూడా బోనాల పండుగ ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, వాన్ కర్ ఉమేష్,వాన్ కర్ రమేష్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, గౌస్ పాషా, ఎజాస్,పిట్ల శ్రీధర్, ఆరేకటిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
