ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హాజరై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో బోనాల పండుగ ఒకటని, ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో ఊరూరా బోనాల పండుగ నిర్వహించి, ప్రజలు తమ మొక్కులను తీర్చుకుంటారని ఆయన అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, ప్రజలంతా ఆయురారో గ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని...