30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రైల్వేస్టేషన్ లో బాంబు స్క్వాడ్ తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాత్రి దేశ రాజధానిలో బాంబుపేలుళ్ళ ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ తనిఖీలకు ఆదేశించింది. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి  బాంబు స్క్వాడ్ టీంలతో సోదాలు చేశారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ లోని పార్శిల్ ఆఫీస్ తో పాటు వెయిటింగ్ హాల్ లో ట్రాన్స్ పోర్టు సామాగ్రిని పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతంలో తనిఖీలు చేశారు.

More articles

Latest article