తెర పైకి మళ్లీ బోగస్ బోనస్ వ్యవహారం

కోటగిరి, బతుకమ్మ:   స్థానిక ఎన్నికలు నగారా మోగిన వెంటనే కోటగిరి మండల కేంద్రంలో రాజకీయాలు వేడెక్కాయి. బోగస్ బోనస్ వ్యవహారంలో సుమారు రూ. 70 లక్షల అవినీతి జరిగిన విషయం అందరికి తెలిసిందే అయితే తాజాగా ఉమ్మడి మండలానికి కీలక నేత పేరును బీఆర్ఎస్ నాయకులు బట్ట బయలు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవి కుమార్ మాట్లాడుతూ.. బోగస్ బోనస్ వ్యవహారం బహిర్గతమైన ఆరు నెలలు కావస్తున్నా విచారణ...