23.7 C
Hyderabad

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బొబ్బిలి వేణు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా బొబ్బిలి వేణుగోపాల్ ను నియమిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాష్ట్రంలోని 21 జిల్లాలకు ఓబీసీ అధ్యక్షులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా నక్క రవీంధర్ ను నియమించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి వేణుగోపాల్ బీజేపీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన సతీమణి బొబ్బిలి సువర్ణ 43వ డివిజన్ కార్పొరేటర్ గా పని  చేస్తున్నారు. తనను జిల్లా అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురికి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article