నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బిఎల్ రాజు, గాజీంగ్ ప్రవీణ్ లకు కార్పరేషన్ డిసిసి కార్యదర్శులుగా నియమిస్తు రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెలీ మహేష్ కుమార్ గౌడ్ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన నిజామాబాద్ డిసిసి కార్యవర్గం విస్థరణలో ఇద్దరిని కార్యదర్శులుగా నియమించారు. శనివారం నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ను కలిసి శాలువతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. తమపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టి డెవలప్ మెంట్ కోసం తమను నియమించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
