30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కనికరం మధు

 

భీమ్ గల్, బతుకమ్మ : రానున్న భవిష్యత్ రోజుల్లో భీమ్ గల్ మున్సిపాలిటీ పై భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి మున్సిపాలిటీని కైవసం చేసుకొంటామని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కనికరం మధు అన్నారు. ఆదివారం పట్టణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని పార్టీ జెండాను సీనియర్ బీజేపీ నాయకులు సంధ్యా రాజుచే ఆవిష్కరింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజులన్నీ బెజేపీవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, జిల్లా ఓ బీ సీ వైస్ ప్రెసిడెంట్ బండారి లక్ష్మణ్ గౌడ్, పతాని ప్రవీణ్, దయ్య ప్రవీణ్, చిన్ని నర్సయ్య, నర్సయ్య యాదవ్, నరేందర్ గౌడ్, నవీన్, లింబాద్రి, గంగాధర్, అజయ్, గణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article