22.7 C
Hyderabad

ఐకెపి వివోఏల సమ్మెకు బీజేపీ పార్టీ మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బీజేపీ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  వివోఏలకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే జీఓ 58ను సవరించి,వివోఏలకు రూ.20 లక్షల వరకు సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సమ్మెలో అధ్యక్షురాలు జరిన, ఉపాధ్యక్షురాలు జిజియా భాయ్, కార్యదర్శి జి.స్వరూప, సహాయ కార్యదర్శి నాగరాణి, కోశాధికారి లావణ్య, జ్యోతి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు ఎముల గజేందర్, కటిక రామ్ రాజ్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్, రేపల్లి సాయిప్రసాద్, తీగుళ్ల రాజా వరప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article