ఐకెపి వివోఏల సమ్మెకు బీజేపీ పార్టీ మద్దతు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బీజేపీ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివోఏలకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే జీఓ 58ను సవరించి,వివోఏలకు రూ.20 లక్షల వరకు సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం...