29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డీజీపీ ఆఫీసు ముట్టడించిన బీజేపీ నేతలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  నగర శివారు పోచారం ఐటీ కారిడార్ లో  గోసంరక్షుడు సోనూసింగ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటుపలు వురు నేతలను పోలీసులు అరెస్టు చేసి  సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.  ఈసందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ  కాంగ్రెస్ సర్కారు ఎంఐఎం  గుండాలను పోషిస్తుందని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

పోచారం ఐటీ కారిడార్ లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. బుధవారం సోనుసింగ్ అలియాస్ ప్రశాంత్ అనే గోసంరక్షణ కార్యకర్తపై ఇబ్రహీం, అతని స్నేహితులు పాత కక్షలతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈఘటనలో నిందితులు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. బాధితుడు సోనుసింగ్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


BJP leaders besiege DGP's office


BJP leaders besiege DGP's office

More articles

Latest article