27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు బిల్లులు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : గత ప్రభుత్వ  హయాంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు అయ్యాయని బుధవారం  మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పత్తి రాము మాట్లాడుతూ..  గత ప్రభుత్వ హయంలో రుద్రూర్ మండల కేంద్రంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు అయ్యాయని అన్నారు. ఒక వారం లోపల ఈ బిల్లులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రుద్రూర్ మండల కేంద్రానికి ఎస్సీ సబ్ ప్లాన్ లో భాగంగా 50 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీలకు నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుకు  రుద్రూర్ మండల ప్రజల తరఫున, పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article