- నాలుగు బైక్ లు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు దొంగిలించిన బైక్ పై వెలుతు పోలీస్ లను చూసి పారిపోవడానికి ప్రయత్నించగ వారిని పట్టుకున్నట్టు నగర ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. పట్టుకున్న వారిని నిర్మల్ జిల్లా బైంసా లోని ఓవైసీ నగర్ కు చెందిన హనువాతే భీం, హనువాతే సుభాష్ లుగా గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం నాగారం 50 క్వార్టర్స్ లో ఉంటు మద్యంకు బానిసలుగా మారి జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. సిరికొండ మండలం వర్జన్ తాండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ భూక్య విఠల్ ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని ఆర్టిసి బస్ స్టాండ్ వద్ద తన బైక్ ను పార్కింగ్ చేసి వెళ్లగా చోరీకి గురైందని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరుపుతుండగా ఆ బైక్ ను చోరీ చేసిన భీమ్, సుభాష్ లు పట్టుబడ్డారని వారు ఇద్ధరు భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా బైక్ దొంగతనాలు చేసినట్టు వెల్లడించారు. వారి వద్ద నుండి 4 బైక్‌లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు.
