బాల్కోండ, బతుకమ్మ :
ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర 12 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన కొరకు భూమి పూజ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకుడు సంతోష్ రూ.2.50 లక్షల వ్యయంతో భారీ హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లూరు హనుమాన్ సేవ స్వాములు, గ్రామ ప్రజలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

