- మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీఓ
- సమస్యలను కలెక్టర్ కు నివేదిస్తామని వెల్లడి
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ కెజీబీవి రెసిడెన్సీయల్ స్కూల్ ను ఎంపీడీఓ సంతోష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులోభాగంగా టీచర్ల అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించి,స్కూల్ లో విద్యార్థుల బాత్ రూమ్ లను, క్లాస్ రూమ్ హాస్టల్ రూమ్స్ ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ రోజువారీగా భోజనం మెనూను అడిగి తెలుసుకొన్నారు.అనంతరం వంటశాల నిర్వహణను పరిశీలించిన ఆయన విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్కూల్ లో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తేవాలని, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీఓ తెలిపారు. ఎంపీడీఓ వెంట ఎంఈఓ స్వామి, కేజీబీవి అధ్యాపకులు ఉన్నారు.