భీమ్ గల్ బల్ధియా ఖర్చు రూ.2 కోట్లా..?

0 99,901
  • వైరల్ గా మారిన సహ చట్టం వివరాలు
  • సోషల్ మీడియాలో గిరికిలు కొడుతున్న ఖర్చు చిట్టా

 

నిజామాబాద్, బతుకమ్మ : కొత్త మున్సిపాలిటీగా ఏర్పడిన ఐదేళ్ళ కాలంలో బల్ధియాలో జరిగే ఖర్చులు అమ్మో ఇంత ఉంటాయా అనే చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు సెలక్షన్ గ్రేడ్ -1 మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మండల కేంద్రంలో కేవలం రెండున్నర ఏళ్ళ కాలంలోనే రూ.2 కోట్ల పై చిలుకు ఖర్చు చేశారా అనే చర్చ మొదలయింది. అదీ కూడా ఎందుకంటే పదవుల పంపకాల పంచాయితీలో రెండున్నర సంవత్సరాల పదవి కాలంలోనే బల్ధియాలో జరిగిన ఖర్చు వివరాలు కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంబంధిత పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండల కేంద్రం 2019లో మేజర్ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. 12 వార్డులతో ఏర్పాటైన కొత్త మున్సిపాలిటీ ఆనాడు బీఆర్ఎస్ గెలుచుకుంది. స్థానికంగా నాయకుల మధ్య అవగాహనతో రెండున్నర ఏళ్ళ పదవి కాలం పేరిట ఇద్దరు చైర్మన్లు భీమ్ గల్ బల్ధియాలో పని చేశారు. ఈ యేడాది జనవరిలో సంబంధిత చివరి పాలకవర్గం సంబంధించిన జమాబంధీతో పాటు ఖర్చుల చిట్టాను ఇటీవల కొందరు సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. అందులో ఉన్న వివరాల ప్రకారం రెండున్నరేళ్ళ పదవి కాలంలో చివరి పాలకవర్గం రూ.1,93,15,200 ఖర్చు అయినట్లు బడ్జెట్ వివరాలను వెల్లడించారు. గతంలో పంచాయితీగా ఉన్న భీమ్ గల్ లో బల్ధియా గా అప్ గ్రేడ్ అయినప్పటికీ  పెద్దగా మార్పు వచ్చిందేమి లేదు.

Bheem Gal Baldiya cost Rs.2 crore..?

సంబంధిత  పనులను కూడా సీడీపీ నిధులతో చేపట్టగా ప్యాచ్ వర్క్ లు, ఇతర వర్కులకే అంత సొమ్ము అదీ కేవలం రెండున్నరేళ్ళలో ఖర్చయిందా అనే చర్చ భీమ్ గల్ లో సాగుతుంది. ప్రస్తుతం భీమ్ గల్ మున్సిపాలిటీ బాల్కొండ నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీ కావడం విశేషం. ఇప్పటి వరకు మూడు పర్యాయాలుగా అక్కడి నుంచి శాసనసభ్యులుగా వేముల ప్రశాంత్ రెడ్డి మున్సిపాలిటీ గా అప్ చేయించారు. అప్గ్రేడ్ అయ్యాక మున్సిపాలిటీని ప్రత్యేక నిధులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే పట్టణం లో రోడ్లు, డివైడర్లు,డ్రైన్స్, కల్వర్ట్స్, సీ. సీ రోడ్లు ఇలా పెద్ద పనులన్నీ మున్సిపల్ రెగ్యులర్ నిధులకు సంబంధం లేకుండా భారీగా డెవలప్మెంట్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల భీమ్ గల్ మున్సిపాలిటీలో చివరి రెండున్నర సంవత్సరాల పాలకవర్గం ఖర్చు వివరాలు సోషల్ మీడియాలో గిరికిలు కొడుతుండగా అందులో ఉన్న చిట్టాపద్దులు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. గత రెండు పాలకవర్గాల హయంలో రాతం చెరువు కబ్జాకు గురైంది. ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి.భీమ్ గల్ మున్సిపల్ అప్గ్రేడ్ అయినా సంవత్సర కాలం పాటు మున్సిపల్ పాలక వర్గం పాత డేట్లల్లో గ్రామపంచాయతీ పేరిట పర్మిషనలను బహటంగా ఇచ్చి అడ్డగోలు సొమ్ము చేసుకొన్నా విషయం విధితమే.అదే విధంగా ఇంటి నంబర్ల ఆధారంగా జరిగిన అవినీతిపై ప్రతిపక్షాలు గగ్గొలు పెట్టాయి. ఇదీలా ఉండగా సమాచార హక్కు చట్టం కింద బహిర్గతమైన వివరాలపై చివరి పాలకవర్గం చైర్ పర్సన్ కన్నే ప్రేమలత సురేంధర్ ను వివరణ కోరగా తమకంటే ముందున్న పాలకవర్గం చేసిన ఖర్చు బకాయి సొమ్ము రూ.70 లక్షల వరకు చెల్లించామని, తమ హయంలో  కోటి 20 లక్షలు వెచ్చించామని తెలిపారు. మేము చేసిన ఖర్చుకు సంబంధించి అన్ని బిల్లు ఉన్నాయని తెలిపారు.ఇదే విషయంపై భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు.

Bheem Gal Baldiya cost Rs.2 crore..?

Leave A Reply

Your email address will not be published.