- ఐఆర్సీ టీసీ టూర్ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆగస్టు 16న ఇందూర్ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక యాత్ర రైలు ప్రారంభం అవుతుందని ఐఆర్సీ టీసీ టూర్ అసిస్టెంట్ మేనేజర్ పివి.వెంకటేష్ తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ పంచ జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ ప్రత్యేక ప్యాకేజీని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ యాత్రలో మహా కాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గ్రిషనేశ్వర్, పంచ జ్యోతిర్లింగ దర్శనంతో పాటు అంబేద్కర్ దీక్ష భూమి, జన్మభూమి కూడా తిలకించ వచ్చని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమై కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్దేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా ఉజ్జయిని చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో పెద్దలకు ఒక్కరికి స్లీపర్ రూ.14,700, 3ఏసీ రూ.22,900, 2ఏసీ రూ.29,900 ఉంటుందని తెలిపారు. ఈ ప్యాకేజీ మూడు పూటల భోజన వసతి, రవాణా సౌకర్యాలు ప్రతి కోచ్ లో ఐఆర్సీటీసీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ టూరిజం.కాబ్ లేదా 9701360701, 9281030712, 9281030711 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేష్ బాబు ఓర్సు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
