27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

మోపాల్, బతుకమ్మ : ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్ పోల్ గ్రామ ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వెంటనే నియోజకవర్గ ప్రజలతో కలసి గ్రామం లో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఒక వైద్యుడిగా ప్రజల బాధ్యత మీ పై ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందుబాటులో ఉంచే విదంగా వారిని తరలించాలని వేడుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రజలను జిల్లా ఆసుపత్రికి తరలించాలి. కాల్ పోల్ గ్రామంలో 24 గంటలు అందుబాటులో ఉండే వైద్యుడిని నియమించాలి” అని దినేష్ పటేల్ అధికారులను కోరారు.  కొన్ని కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణ సాయం అందించాలంటూ సీఎంఆర్‌ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయానికి ఎమ్మెల్యే చొరవ చూపాలని అన్నారు. ఇది రాజకీయాల వ్యవహారం కాదు… ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను” అని ఆయన స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఇక్కడి ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, మండల అధ్యక్షులు శశాంక్, మాజీ మండల అధ్యక్షులు రవి, కార్పొరేటర్ ప్రమోద్, మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నాయకులు చిన్న రెడ్డి, కిషన్, కృష్ణ నాయక్, ఓం సింగ్, రమేష్ నాయక్, నరేందర్ రాథోడ్, శంకర్ రెడ్డి, తిరుపతి, జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Better facilities should be provided to the people

More articles

Latest article