25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆయిల్ పామ్ సాగుతో లాభాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: తెలంగాణ రాష్ట్రంలో అయిల్ పామ్ సాగు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కలిపిస్తుంది ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన శాఖ, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ వారు సంయుక్తంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఏర్గట్ల మండలంలోని గుమ్మి ర్యాల గ్రామంలో మాజీ సర్పంచ్ రైతు సోమ రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నర్సయ్యా, డైరెక్టర్ లింగ రెడ్డి, తాళ్ల రాంపూర్, సొసైటీ చైర్మన్  శ్రీనివాస్ రెడ్డి, ఉద్యాన అధికారి రుద్ర వినాయక్  రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు కోసం రైతుకి ప్రభుత్వం నుండి సబ్సిడీ లో మొక్కలు అలాగే డ్రిప్ పరికరాలు అందిస్తున్నారని అంతే కాకుండా ఆయిల్ పామ్ నాటుకున్న రైతులకు పంట యాజమాన్యం మరియు అంతర పంట నిర్వహణ కోసం ఎకరానికి 4,200 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు 16,800 రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. ప్రతి రైతు అపోహలు మానుకొని విరివిగా ఆయిల్ పామ్ సాగు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్, విస్తరణ అధికారి సాయి సచిన్, రైతులు సోమ దేవరెడ్డి రాజారెడ్డి, లింగారెడ్డి, సంజీవ్ యాదవ్, అనిల్ రెడ్డి, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధి ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article