- రైడ్స్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి కౌన్సిలింగ్
రుద్రూర్, బతుకమ్మ: ప్రతి చిన్నారి చిరునవ్వు వెనుక ఒక భవిష్యత్తు ఉందని రుద్రూర్ రైడ్స్ బృందం వారు తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయం పక్కనే గత కొంత కాలంగా తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న బొంబాయి (చాకలి)సంజీవ్ – ఇందుల పిల్లలు అనాధలుగా రోడ్లపై కనిపిస్తున్నారు. వారికి మొత్తం ఎనిమిది మంది పిల్లలు. ప్రతి చిన్నారి చిరునవ్వు వెనుక ఒక భవిష్యత్తు ఉంటుందని, వారి భవిష్యత్తు కోసం సురక్షితమైన హాస్టల్ వాతావరణం అందించేందుకు ఆదివారం రైడ్స్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ ఆడపిల్లలను వసతి గృహంలో చేర్పించుటకు సహకారం అందించారు. కార్యక్రమంలో రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, ఉపాధ్యక్షులు నూతిపల్లి బాలరాజ్, సలహాదారులు టీపీ రాజేందర్, ఓముల సాయన్న, చిక్కెల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
