44వ నంబర్ జాతీయ రహదారిపై ఘటన
నిజామాబాద్, బతుకమ్మ : గుర్తు తెలియని వాహనం ఢీకొని మూడు సంవత్సరాల ఎలుగుబంటి మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈఘటన చోటు చేసుకుంది. కాగా, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వన్య ప్రాణులు మృతి చెందడం ఆందోళన కలిగించే విషయం.
