నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఈ నెల 11న పులాంగ్ చౌరస్తాలోని గల అంబేడ్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్మదీక్ష కార్యక్రం చేపడుతున్నామని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. గురువారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు బీసీలను మోసం చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, నయవంచను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, కేంద్రాల్లో…. “బీసీల ధర్మ పోరాట దీక్ష” చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీ కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 1-5- 2025 న నిర్ణయం తీసుకొని ప్రకటించిందని, కానీ ఇప్పుడు కులగణన శాస్త్రీయమైన పద్ధతిలో చేయకుండా, ఓబీసీ కుటుంబాలను లెక్కించకుండా, బీసీ కాలం లేకుండా, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ లేకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని అన్నారు. రెండవసారి అప్పుడే జాతీయ జన గణన ఆగస్టు 17వ తేదీ నుండి ప్రారంభం మొదలుపెట్టిందన్నారు. కావున ఈ ధర్మ పోరాట దీక్షలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి బీసీల న్యాయమైన డిమాండ్ ను వినిపించాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కొయ్యాడ శంకర్, శ్రీలత, కొట్టూర్ చంద్రకాంత్, సాయి, బసవ, రేఖ, దేశాయి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
