28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బీసీ కుల సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట బతుకమ్మ :

 

నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటు వంటి సంఘటనకు నిరసనగా నందిపేట మండలంలో నందిపేట గ్రామ సర్పంచ్ ఎర్రం లింగన్న ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జాతరకు వచ్చిన రజక కులస్తులైన గణేష్ కుటుంబంపై దాడి చేసి వారి పసిపాప ప్రాణాలు తీసిన అందరినీ అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో విచారణ త్వరితగతిన చేపట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగన్న, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, రాష్ట్ర నాయకులు కొయ్యాడ శంకర్, సాయి బసవ, త్రివేద్, బుడ్డ సంజు, కొండూర్ సంతోష్, దినేష్, దారం సురేష్, నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

 

BC caste organizations' candlelight rally

 

More articles

Latest article