- బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ఇమ్మడి గోపి
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పన కొరకు తలపెట్టిన బీసీ బందును విజయవంతం చేశారు. మండల కేంద్రంలో బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.విషయం తెలుసుకున్న ఎస్ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న వారిని సముదాయించి ధర్నాను విరమింప చేశారు. బీసీ బంద్ ధర్నాకు వివిద గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంపూర్ణ మద్దతును తెలిపారు.అనంతరం బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు ఇమ్మడి గోపి మాట్లాడుతూ బిసి 42 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీసి సంఘం రాష్ట్ర నాయకులు ఇమ్మడి గోపి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టించడానికి ప్రత్యేక కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో బీసీలు రగిలిపోతున్నారన్నారు.బిజెపి ఎంపీలు,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీసీల కొరకు ఎందుకు కొట్లాడటం లేదన్నారు. తెలంగాణలో బీసీ ఎంపీలందరూ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి గవర్నర్ వద్ద ఉన్న బిల్లును ఆమోదింప చేసేలా ప్రయత్నం చేయాలని అన్నారు.బీసీల ఓట్లతో గెలిచిన మిమ్మల్ని బీసీ బిడ్డలు గమనిస్తున్నారన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజులలో బీసీ బిడ్డలే తమకు తగిన గుణపాఠం చెప్తారన్నారు. నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ బిసి బిల్లు పట్ల అమలుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, బీసీలను మోసం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు జీవో నెంబర్ 9ని వెంటనే గవర్నర్ వద్ద ఉన్న బిల్లును ఆమోదింప చేసేలా తెలంగాణ ఎంపీలు ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్,మోచ్చే గోపాల్,రాజు, మల్లేష్ రోహిత్ గౌడ్,కర్ణాకర్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
- బీసీ బందులో ప్రతిపక్ష పార్టీల ర్యాలీ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కొరకే తలపెట్టిన బీసీ బందు కార్యక్రమంలో బిజెపి టీఆర్ఎస్ పార్టీలు పార్టీల నాయకులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆటంకం కల్పిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి బీసీ బిడ్డలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, నాయుడు రాజన్న,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్,సీనియర్ నాయకులు పాశంకుమార్,రఘు, మాజీ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
