27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ చిట్టి చేతులతో స్వయంగా బతుకమ్మని పేర్చి ప్రత్యేక దుస్తులతో సంప్రదాయ బద్దంగా విద్యార్థులు అలంకరించుకొని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ గ్రామంలో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను గ్రామ చెరువులో వదిలేసి తినుబండారాలను ఒకరికి ఒకరు పంచుకుంటూ సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు సుమతి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article