29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బాసర త్రిబుల్ ఐటీ వీసీ నీ వెంటనే తొలగించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . త్రిబుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పి.డి.ఎస్.యూ సంపూర్ణ మద్దతు

 

బాసర, బతుకమ్మ :

 

బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జి వీసీ ని తొలగించాలని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పి.యూ.సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయి తేజస్విని మరణం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందని, నిత్యం ఆత్మహత్యలు, అనారోగ్య సంబంధిత కారణాలు ఉన్న పట్టించుకోకపోవడం వలన ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అలాగే విద్యార్థులకు సరిపోయే ఫ్యాకల్టీ లేదని, వైద్య సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రశ్నించే విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, యూనివర్సిటీలో అవినీతి పెరిగిపోయిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మెస్ కాంట్రాక్ట్ ఒక్కరికె అప్పగించడం, వంట పాత్రల కొనుగోళ్ళలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, మెయింటనెన్స్, అనేక పనులలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న, బాధ్యత లేని వీసీ ని, వో.ఎస్.డి ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article