27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బాపూజీ వచనాలయ పాలకవర్గం పారదర్శకంగా పనిచేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఇటీవల నూతనంగా ఎన్నికైన బాపూజీ వచనాలయ పాలకవర్గం కమిటీ పారదర్శకంగా పనిచేయాలని పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు భాస రాజేశ్వర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపూజీ వచనాలయం విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్  అందించే విధంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. సామాజిక, రాజకీయ సామాజిక స్పృహ పెంపొందించే విధంగానూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. సిబ్బందికి మూడు సంవత్సరాలకు వేతన సవరణ జరగాలన్నారు. సంస్థ పేరు చెప్పుకొని కొందరు తమ స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని, దీన్ని సహించేది లేదన్నారు. సమావేశంలో పరిరక్షణ కమిటీ సభ్యులు రవీందర్, రఫిక్ కుదిన్, గుజ్జ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article