23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

 పిట్లంలో బ్యాంక్ ఏటీఎంలో చోరి

Must read

📰 Generate e-Paper Clip

. . . 17 లక్షల నగదు అపహరణ

. . . గ్యాస్ కట్టర్ లతో ఏటీఎం మిషన్ ధ్వంసం చేసి దోపిడి

పిట్లం, బతుకమ్మ

గుర్తు తెలియని అగంతకులు పిట్లంలో బ్యాంక్ ఏటీఎంలో చోరికి  పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం  రాత్రి జరిగింది. పిట్లం మండల కేంద్రంలోని ఎస్ బిఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్ తో మిషన్ ను ధ్వంసం చేసి చోరికి  పాల్పడ్డారు. ముసుగులు ధరించిన దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించినట్లు స్థానికంగా ఉన్న సమాచారం మేరకు వెల్లడయింది. ఏటీఎం దొంగతనాల్లో ఆరితేరిన వారే చోరి చేసినట్లు తెలుస్తోంది. చోరి జరిగినప్పుడు ఏటీఎంలో రూ.17 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. మండల కేంద్రంలో జరిగిన చోరి పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతుంది. కొన్ని రోజుల క్రితం బిచ్కుంద మండల కేంద్రంలోనూ దొంగల ముఠా బ్యాంక్ ఏటీఎంలో చోరికి పాల్పడిన విషయం తెల్సిందే. ఏకంగా మిషన్ ను ఎత్తుకెళ్లి చోరికి ప్రయత్నించడం గమనార్హం.

Bank ATM robbery in Pitlam

More articles

Latest article