బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన సుదనవేణి సాత్విక ఎన్ సిసిలో జాతీయస్థాయిలో బంగారు పతకం గెలుపొంది తన ప్రతిభను చాటింది. సాత్విక ప్రస్తుతం నిజామాబాద్ మహిళా కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువును కొనసాగిస్తూ, ఎంతో పట్టుదలతో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఎన్ సి సి లో ఎంపికై అనంతపూర్, కాకినాడలో, తమిళనాడులో ప్రత్యేక శిక్షణ పొంది ఢిల్లీకి పోవడం జరిగింది. అక్కడ ఎంతో నైపుణ్యంతో తన ప్రతిభను చాటి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. సాత్విక బంగారు పతకం సాధించడం పట్ల ఏర్గట్ల గ్రామ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సాత్విక కు అభినందనలు తెలిపారు. ఈ విషయం ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. మోర్తాడ్ ప్రజా నిలయం లో సాత్విక ను పూలమాల శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవరెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, కిషన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూస్కు మోహన్ రెడ్డి,తాళ్ల రాంపూర్ భాను,లింగంపల్లి ప్రసాద్ గౌడ్, ఓరుసు రాములు,వడ్నాల జగదీష్, లు పాల్గొన్నారు.
సాత్విక ను అభినందించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల


