26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బైరి రవి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శుక్రవారం  మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లుతెలిపారు.నూతన మండల అధ్యక్షులుగా బైరి రవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు.ప్రధాన కార్యదర్శి గొంగ గంగాధర్,ఉపాధ్యక్షులు ఉప్పల్వాయి శంకర్,గురిజాల నవీన్,కార్యదర్శిగా ఉప్పల్వాయి రఘుపతి,కోశాధికారి బిక్కయి సాయిలు,ను ఎన్నుకున్నారు.అనంతరం మండల అధ్యక్షులుగా ఎన్నికైన బైరి రవి మాట్లాడుతూ మున్నూరు కాపుల హక్కుల కొరకు సమస్యలు తీర్చడంలో ముందుంటానని అన్నారు,దీనికి సంఘసభ్యులందరు సహకరించాలని కోరారు,భవిష్యత్తులో మున్నూరు కాపు సంఘం హక్కుల సాధనకై రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి,మండల స్థాయిలలో  ఎప్పుడు పిలుపిచ్చిన అందరు సహకరించాలని కోరారు.స్థానిక సంస్థలు ఉన్నందున అందరు ఐక్యంగాఉండాలన్నారు.అనంతరం తనపట్ల ఏంతో నమ్మకంగా  మండల అధ్యక్షునిగాఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యుల సంఘం బాగోగులు చూసే వ్యక్తి మనకు అవసరమని  సభ్యులంతా ఆలోచించి. బైరి రవిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అయినది  కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉంటూ గ్రామములో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా నడిపించి గ్రామం అభివృద్ధి కోసం కష్టపడుతూ తన వంతు కృషిగా  మున్నూరు కాపు సంఘ సభ్యుల అభివృద్ధిని కూడా ఆయన కు ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో  మున్నూరు కాపు సంఘ సభ్యులు ఏకగ్రీవంగా  శుక్రవారం నాడు బైరి రవి, నీ  అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అనంతరం బైరవి మాట్లాడుతూ నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని మా యొక్క కుల సభ్యుల సమక్షంలో నాపై ఉంచిన నమ్మకాన్ని అందరికీ న్యాయపరుస్తారని కుల సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సలహాదారులు,సభ్యులు, వున్నారు.

More articles

Latest article