ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బైరి రవిని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గ్రామంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ రామాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎస్.కె నిస్సర్, కోశాధికారిగా పూజ్యం వీరయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు. అలాగే గ్రామ శాఖ ఉపాధ్యక్షులుగా తుమ్మల శ్రీనివాస్, ముడెగామ శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి పెద్ద గంగారం, కార్యదర్శిగా వాసవి పరమేష్, కార్యవర్గ సభ్యులుగా తోట రాజన్న, నారాయణ, కమ్మరి శివ, ఎరుకల ప్రసాద్, గట్టు గంగాధర్ తదితరులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమని గంగారం, మాజీ సర్పంచ్ ఆరెపల్లి దశరథ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజ్యం రవికుమార్, షేక్ మదర్ ఖురేషి, వాచర్ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
