ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బైరి రవి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బైరి రవిని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గ్రామంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ రామాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎస్.కె నిస్సర్, కోశాధికారిగా పూజ్యం వీరయ్య ఏకగ్రీవంగా ఎన్నిక...