- పేకాట ఆడుతు పట్టుబడిన క్లబ్ ల ఆర్గనైజర్స్
- నందిపేట్ పోలీసుల దాడిలో పట్టుబడిన 12 మంది పేకాట రాయుళ్లు
- రూ.2,12,520 నగదు, రెండు కార్లు, రెండు బైక్ లు, 10 సెల్ ఫోన్ లు సీజ్
నందిపేట్, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ బాస్ సాయి చైతన్య వచ్చి రావడంతోనే పేకాట పై ఉక్కుపాదం మోపారు. నిజామాబాద్ నుంచి కర్నాటకలోని ఉద్గీర్ లేదా మహరాష్ట్రలోని బోరీలో పేకాటకు అలవాటు పడ్డారు మన పేకాట రాయుళ్లు. వారిని ఆర్గనైజర్స్ సకల సౌకర్యాలతో క్లబ్ లకు తరలిస్తుండగా బోరిలోని పేకాట క్లబ్ మూతపడింది. దానితో అక్కడి వరకు వెళ్లలేక కొందరు ప్రత్యామ్నాయంగా పేకాట నిర్వహణకు ఆర్గనైజర్స్ నందిపేట్ శివారు ప్రాంతాలకు అడ్డాలను మార్చారు. పొలాలలోని ఫాం హౌజ్ లలో సౌకర్యాలు చాలడం లేదని నందిపేట్ మండలం బాధ్గుణలోని గురడి రెడ్డి కళ్యాణ మండపంలో పేకాట స్థావరంగా మార్చారు. గత కొంతకాలంగా అక్కడ నిజామాబాద్ నగరానికి చెందిన పేకాటను క్లబ్ ల నిర్వహణ చేపట్టడంతో అక్కడ గేమ్ కు రూ.30 వేలతో ఆటను మొదలు పెట్టారు. అయితే అక్కడ స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ లేకపోయిన నిత్యం కళ్యాణ మండపంలో కార్లు, దావత్ లు జరుగుతుండటంతో అనుమానంతో గురువారం రాత్రి పోలీసులు రైడ్ చేయడంతో పేకాట గుట్టు రట్టయింది. పోలీసుల దాడిలో పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి రూ.2,12,520 నగదు,10 మొబైల్ ఫోన్లు,రెండు కార్లు,రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో గడ్డం గంగారెడ్డి (బాద్గుణ ), నికాల్పూర్ మహిపాల్ రెడ్డి (బాద్గుణ ), నీరది చిన్నయ్య (బాద్గుణ ), కొత్తొల్ల మహేందర్ రెడ్డి (నిజామాబాద్), సుద్ధపల్లి రాజేంద్ర గౌడ్ (నిజామాబాద్), గాజుల శ్రీనివాస్ (నిజామాబాద్), అర్గనైజర్ కస్తూరి శ్రీనివాస్ అలియాస్ పోలీస్ శ్రీనివాస్ (నిజామాబాద్), జిన్నా భరత్ రెడ్డి (నిజామాబాద్), దాత్రిక రాధాకిషన్ (నిజామాబాద్), షేక్ హైదర్ (నందిపేట), వాకిడి కార్తిక్ రెడ్డి(వన్నెల-కె), చాకలి ముతన్న (మయపూర్) లు ఉన్నారు.
