నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ నేతలకు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మతిస్థిమితం కోల్పోయి ప్రముఖఆలయాల వద్ద కూడా నీచ రాజకీయాలకు పాల్పరుగుతున్నారని, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సూచించారు. వాస్తవానికి రథోత్సవానికి భక్తులు అధికంగా రావడం,కొంత మంది భక్తులు రథోత్సవాన్ని చూడాలనే తొందరలో వాహనాలను రోడ్డుకి ఇరువైపులా నిలపడం ద్వారా, మరో ముగ్గురు రాంగ్ రూట్లో రావడం ద్వారా రద్దీకి కారణమైంది. రథోస్తవ సమయంలో పోలీసులు ఎక్కువ మంది పైకి వెళ్లడం వల్ల కింద ఈ సమస్య నెలకొందని అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులను పంపి ప్రశాంత్ రెడ్డిని మాత్రమే ఆపారు అని భగవంతుని దగ్గర ఉండి మాట్లాడటం తగదన్నారు. .వాస్తవానికి టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, తాను, ముత్యాల సునీల్ కూడా దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళామని ప్రశాంత్ రెడ్డి తెల్సుకుంటే బాగుంటుందన్నారు. దేవుని కోసం మనం వెళ్ళాలి కానీ మన కోసం దేవుడు ఆగడని ఆ విషయం గుర్తుంచుకోవాలని, కానీ ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి తన విలువలు తగ్గించుకోవద్దని హితవు పలికారు.
