28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు లక్షలకు పసికందు విక్రయం

Must read

📰 Generate e-Paper Clip

  • సోలాపూర్ కు చెందిన వ్యక్తి అమ్మకం పై సిడిపిఓ ఫిర్యాదు
  • ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

 

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : ఐదవ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని పసికందును విక్రయించారు తల్లిదండ్రులు. ఈ వ్యవహారం లో 1098కు ఫిర్యాదు రావడంతో పరిశీలించిన చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 1వ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. 1వ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మిర్చి కంపౌండ్ కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్రావు దంపతులకు ఇది వరకు నలుగురు సంతానం. ముత్యాలమ్మకు ఐదవ సంతానం గా జూన్ 30న ఆడపిల్ల జన్మించిoది. ఆడపిల్లను పోషించలేనని మిర్చి కంపౌండ్ చెందిన ఉమారాణి తనకు తెలిసిన నాగమణి ద్వారా పసిపాపను విక్రయానికి సిద్ధమయ్యారు. ఐదు రోజుల క్రితం మహారాష్ట్రలోని సోలాపూర్ వాసికి రెండు లక్షలకు పసికందును విక్రయించారు. ఈ విషయంలో 1098కు ఫిర్యాదు రాగా పరిశీలించిన సిడిపిఓ సౌందర్య 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.

More articles

Latest article