25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా బతుకమ్మ: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎస్సారెస్పీ, బాబ్లీ ప్రాజెక్టు, సీడబ్ల్యూసీ అధికారులు మంగళవారం  తెరిచారు.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన గేట్లను ఎత్తి, అక్టోబర్ 28న మూసివేయాలి. అంతేకాకుండా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులు మార్చి ఒకటిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లెత్తి 0.6 టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి అందించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్సీ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article